Tue Dec 24 2024 18:27:01 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలోకి సీబీఐకి నో ఎంట్రీ
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐకి గతంలో దర్యాప్తుకోసం ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐకి గతంలో దర్యాప్తుకోసం ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది. జీవో నెంబరు 51 ద్వారా ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. సీబీఐ రాష్ట్రంలో ప్రవేశించకుండా నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 30వ తేదీన హోంశాఖ ఈ ఉత్తర్వులు ఇచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది.
ఆగస్టు 30వ తేదీనే...
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని దర్యాప్తు సంస్థ అయిన సీబీఐకి ఇక తెలంగాణలో అనుమతి లేదు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకున్న తర్వాతనే విచారణ జరపాల్సి ఉంటుంది. గతంలో చంద్రబాబు సర్కార్ కూడా ఇదే తరహా ఉత్తర్వులు ఆంధ్రప్రదేశ్ లో జారీ చేశారు. సీబీఐ నేరుగా దర్యాప్తు కోసం తెలంగాణలోకి ప్రవేశించడానికి వీలులేదు. ప్రభుత్వ అనుమతి తీసుకున్న తర్వాతనే విచారణ చేయాల్సి ఉంటుంది.
Next Story