Mon Dec 23 2024 14:44:25 GMT+0000 (Coordinated Universal Time)
టిక్కెట్ కోసమేనా.. ఈ అవస్థలు...?
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మరోసారి వివాదాస్పదమయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లు మొక్కడం చర్చనీయాంశమైంది
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మరోసారి వివాదాస్పదమయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లు మొక్కడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. నిన్న మెడికల్ ఆసుపత్రిల ప్రారంభోత్సవానికి హాజరైన శ్రీనివాసరావు సమావేశం ముగిసిన తర్వాత పదే పదే కేసీఆర్ కాళ్ల మీద పడటం చర్చనీయాంశమైంది.
కాళ్లుమొక్కిన...
గతంలోనూ శ్రీనివాసరావు ఖమ్మం జిల్లాలో ఒక స్వామికి పూజలు చేసి వార్తల్లోకి ఎక్కారు. అలాగే బతుకమ్మ పండగ రోజు సినిమా పాటలకు డ్యాన్స్ లు చేసి వివాదాస్పదమయ్యారు. మరోసారి ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లు పదే పదే మొక్కడం వెనక వచ్చే ఎన్నికల్లో సీటు కోసమేనన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినపడుతున్నాయి. ఆయన కొత్తగూడెం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు గతంలో అనేక వార్తలు వచ్చాయి. అందుకే రెండుసార్లు కాళ్లు మొక్కి కేసీఆర్ దృష్టిలో పడేందుకు ప్రయత్నించి ఉంటారని గులాబీ పార్టీలోనూ గుసగుసలు విన్పిస్తున్నాయి.
- Tags
- srinivasarao
- kcr
Next Story