Mon Dec 23 2024 10:06:07 GMT+0000 (Coordinated Universal Time)
వివేకా హత్యకేసులో ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు
వైఎస్ వివేకా హత్యలో ఎర్రగంగిరెడ్డి కీలక పాత్ర పోషించాడన్న ఆరోపణ ఉంది. గంగిరెడ్డి బయట ఉండటంతో హత్యకేసులో..
వైఎస్ వివేకా హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. సీబీఐ ఎప్పుడు, ఎవరిని, ఎలా అరెస్ట్ చేస్తుందో అంతుపట్టడం లేదు. ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రిని సీబీఐ అరెస్ట్ చేసింది. తనను కూడా అరెస్ట్ చేస్తారని భావించిన అవినాష్ రెడ్డి ముందుగానే కోర్టును ఆశ్రయించాడు. తాజాగా.. తెలంగాణ హైకోర్టు వివేకా హత్యకేసులో నిందితుడిగా ఉన్న ఎర్రగంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేసింది. మే 5వ తేదీ లోగా సీబీఐ కోర్టు ముందు లొంగిపోవాలని గంగిరెడ్డిని ఆదేశించింది.
వైఎస్ వివేకా హత్యలో ఎర్రగంగిరెడ్డి కీలక పాత్ర పోషించాడన్న ఆరోపణ ఉంది. గంగిరెడ్డి బయట ఉండటంతో హత్యకేసులో ఉన్న సాక్షులు భయపడుతున్నారని సీబీఐ హైకోర్టు తెలిపింది. సీబీఐ వాదనతో ఏకీభవించిన హైకోర్టు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేసింది. వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి సాక్షాలు తారుమారు చేసిన కేసులో 2019 మార్చి 28న ఎర్ర గంగిరెడ్డి అరెస్టు అయ్యాడు. 2019 జూన్ 27న ఎర్రగంగిరెడ్డి బెయిల్ పై విడుదలయ్యాడు. అప్పటి నుండి ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ గతంలో సుప్రీంకోర్టు, తెలంగాణా కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన హైకోర్టు తాజాగా ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేస్తూ తీర్పు వెల్లడించింది.
Next Story