Mon Dec 23 2024 00:24:56 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ సర్కార్ కు షాక్.. బీజేపీ ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
బీజేపీ ధర్నాకు అనుమతిస్తే రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించగా..
బీజేపీ నిర్వహించ తలపెట్టిన మహాధర్నాకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంగళవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో ధర్నా చేసుకోవచ్చని న్యాయస్థానం తెలిపింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వ వైఫల్యంపై మహాధర్నా చేయాలని బీజేపీ నిర్ణయించగా.. అందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దాంతో బీజేపీ సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ పై విచారణ చేపట్టిన హై కోర్టు.. మహాధర్నాకు షరతులతో కూడిన అనుమతినిస్తూ.. తెలంగాణ సర్కార్ కు ఊహించని షాకిచ్చింది.
బీజేపీ ధర్నాకు అనుమతిస్తే రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించగా.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వం పై ధర్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి కదా అప్పుడు విఘాతం కలుగలేదా ? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేసినపుడు లా అండ్ ఆర్డర్ గుర్తురాలేదా అని ప్రశ్నించింది. వెయ్యిమందికే భద్రత కల్పించలేకపోతే.. కోటి మందిని ఎలా కాపాడుతారని పోలీస్ యంత్రాంగాన్నీ ప్రశ్నించింది. కేంద్ర క్యాబినెట్ మంత్రి ధర్నాకు పిలుపునిచ్చినప్పుడు అనుమతి నిరాకరించడం ఏంటని తెలంగాణ సర్కార్ ను నిలదీసింది. అలాగే.. బీజేపీ కేవలం ధర్నా మాత్రమే చేసుకోవాలని, ర్యాలీకి అనుమతి లేదని హైకోర్టు స్పష్టం చేసింది. 500 మందితో మాత్రమే ధర్నాకు అనుమతినిచ్చింది.
Next Story