Wed Dec 18 2024 21:25:38 GMT+0000 (Coordinated Universal Time)
కామారెడ్డి మాస్టర్‌ప్లాన్ పై హైకోర్టు కీలక ఆదేశం
కామారెడ్డి మాస్టర్‌ప్లాన్ పై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టుకు తెలపకుండాఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని పేర్కొంది
కామారెడ్డి మాస్టర్‌ప్లాన్ పై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టుకు తెలపకుండా మాస్టర్ ప్లాన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని పేర్కొంది. కామారెడ్డి మాస్టర్‌ప్లాన్ పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ వాదనల సందర్భంగా కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను హోల్డ్ లో పెట్టామని ప్రభుత్వం తరుపున న్యాయవాది న్యాయస్థానానికి వివరించారు.
హైకోర్టుకు తెలియకుండా...
సింగిల్ బెంచ్ లో ఉన్న మరో పిటిషన్ ను డివిజన్ బెంచ్ లో హైకోర్టు ఇంప్లీడ్ చేసింది. దీనిపై విచారణ జరుగుతున్న సమయంలో కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇటీవల మాస్టర్ ప్లాన్ వివాదంతో కామారెడ్డిలో టెన్షన్ నెలకొంది. రైతులు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేశారు. దీనిపై పలువురు పిటీషన్లు దాఖలు చేశారు. దీనిపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది.
Next Story