Sun Dec 22 2024 14:12:01 GMT+0000 (Coordinated Universal Time)
అప్పటి వరకూ గ్రూప్ 1 ఫలితాలు వాయిదా
మరికొద్దిరోజుల్లోనే గ్రూప్ 1 రీ ఎగ్జామ్ ఫైనల్ కీ విడుదల చేసేందుకు టీఎస్ పీఎస్సీ సిద్ధమవుతోంది. త్వరలోనే ఫలితాలు..
తెలంగాణలో టీఎస్ పీఎస్సీ లీకేజీ వ్యవహారం తర్వాత.. గ్రూప్ 1 రీ ఎగ్జామ్ నిర్వహించిన విషయం తెలిసిందే. జూన్ 11న తెలంగాణ వ్యాప్తంగా మరోసారి గ్రూప్ 1 పరీక్షను నిర్వహించగా.. 994 పరీక్ష కేంద్రాల్లో 2 లక్షల 32 వేల 457 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. మరికొద్దిరోజుల్లోనే గ్రూప్ 1 రీ ఎగ్జామ్ ఫైనల్ కీ విడుదల చేసేందుకు టీఎస్ పీఎస్సీ సిద్ధమవుతోంది. త్వరలోనే ఫలితాలు కూడా విడుదలవుతాయనగా.. కొందరు అభ్యర్థులు అభ్యంతరాలు తెలుపుతూ హైకోర్టును ఆశ్రయించడంతో.. గ్రూప్ 1 ఫలితాల విడుదలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో అధికారులు బయోమెట్రిక్ విధానం పెట్టకపోవడంపై పలువురు అభ్యర్థులు అభ్యంతరం తెలుపుతూ హై కోర్టును ఆశ్రయించగా.. ఆ పిటిషన్ పై విచారణ చేసిన కోర్టు.. కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషన్ విచారణ సమయంలో ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ హాజరు కాకపోవడంతో.. జులై 31కు తదుపరి విచారణను వాయిదా వేస్తూ.. ఆ రోజున ప్రభుత్వం తరపు వాదనలు వింటామని కోర్టు తెలిపింది. అప్పటి వరకూ గ్రూప్ 1 ఫలితాలు ప్రకటించవద్దని హై కోర్టు స్పష్టం చేసింది.
Next Story