Mon Dec 23 2024 11:37:24 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో జూన్ లో ఎంసెట్, ఈసెట్
జూన్ లో ఎంసెట్, ఈసెట్ పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయించింది
జూన్ లో ఎంసెట్, ఈసెట్ పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. మిగిలిన సెట్లను జులైలో నిర్వహించాలని నిశ్చయించింది. ఇంటర్ పరీక్షలు మే 7వ తేదీన ముగియనుండటంతో ఆ తర్వాత ఎంసెట్, ఈసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. జూన్ మూడు లేదా నాలుగో వారంలో ఎంసెట్, ఈసెట్ పరీక్షలు నిర్వహించే అవకాశముంది. ఇంకా తేదీలు ఖరారు కాకపోయినా ప్రాధమికంగా ఒక నిర్ణయానికి వచ్చారు.
మిగిలినవి జులైలో...
ఇక మిగిలిపోయిన ఐసెట్, ఎడ్సెట్, లాసెట్, పీఈసెట్, పీజీ ఇంజినీరింగ్ సెట్లను జులై నెలలో నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. డిగ్రీ పరీక్షలు జూన్ నెలాఖరు వరకూ జరుగుతుండటంతో ఈ పరీక్షలను జులైలో నిర్వహించనున్నారు. త్వరలోనే పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ప్రకటించనుంది.
Next Story