Fri Nov 22 2024 19:07:00 GMT+0000 (Coordinated Universal Time)
ఇందిరాపార్క్ వద్ద హోంగార్డుల ధర్నా.. అరెస్ట్
రంగంలోకి దిగిన పోలీసులు.. ధర్నాకు అనుమతి లేదని.. వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని హోం గార్డులను హెచ్చరించారు.
తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పోలీస్ యంత్రాంగంలో పనిచేస్తున్న హోం గార్డులు బుధవారం చలో ధర్నా చౌక్ కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఇందిరాగాంధీ పార్క్ వద్ద హోం గార్డులు పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. ధర్నా చౌక్ వద్ద బైఠాయించిన హోంగార్డులు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. వి వాంట్ జస్టిస్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు.
రంగంలోకి దిగిన పోలీసులు.. ధర్నాకు అనుమతి లేదని.. వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని హోం గార్డులను హెచ్చరించారు. ధర్నా విరమించకపోవడంతో.. ధర్నా చేస్తున్న హోంగార్డులను అడ్డుకున్నారు. వారిని అరెస్టు చేసి వాహనంలో ఎక్కించి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. హోంగార్డులతో పాటు.. చనిపోయిన హోంగార్డుల వారి కుటుంబ సభ్యులు ధర్నా చౌక్ వద్దకు వచ్చి కారుణ్య నియామకాలు చేపట్టాలని ఆందోళన చేపట్టడంతో వారిని కూడా అరెస్టు చేసి వాహనాల్లో ఎక్కించి స్థానిక పోలీస్ స్టేషన్ కి తరలించారు. హోంగార్డుల ధర్నా, అరెస్టు నేపథ్యంలో ధర్నా చౌక్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Next Story