Mon Dec 23 2024 13:42:43 GMT+0000 (Coordinated Universal Time)
ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు అలర్ట్.. సంస్కృతం ప్రశ్నాపత్రం ఇలా !
తెలంగాణ ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు సంబంధించి.. ద్వితీయ భాష అయిన సంస్కృతం నమూనా ప్రశ్నాపత్రం..
హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు సంబంధించి.. ద్వితీయ భాష అయిన సంస్కృతం నమూనా ప్రశ్నాపత్రం విడుదలైంది. ఈ ప్రశ్నాపత్రంలో ఏయే ప్రశ్నలు ఎన్నెన్ని మార్కులకు వస్తాయో తెలిపారు. ప్రశ్నాపత్రంలో మొదటి బిట్ నందు మూడు శ్లోకాలు ఇచ్చి ఏదేని ఒక శ్లోకానికి ప్రతిపదార్దం రాయాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నకు 1 × 6 = 6 మార్కులు కేటాయించారు. రెండవ బిట్ లో 3 వ్యాసరూప సమాధాన ప్రశ్నలు ఇచ్చి.. ఏదేని ఒక్క ప్రశ్నకు సమాధానం రాయమంటారు. దీనికి కూడా 1 × 6 = 6 మార్కులు కేటాయించారు.
2 వ బిట్ లో గద్యభాగం ప్రశ్నలు ఇచ్చి ఏదేని నుండి 3 వ్యాసరూప ఒక ప్రశ్నకు సమాధానం మార్కులు రాయమంటారు . దీనికి 1x6 = 6 మార్కులుంటాయి. 4 వ బిట్ ఉప వాచకం నుండి 4 ప్రశ్నలు ఇచ్చి ఏదేని రెండు ప్రశ్నలకు సమాధానాలు రాయమంటారు. ఒక ప్రశ్నకు 4 మార్కులు అనగా ఈ బిట్టుకు 2x4 = 8 మార్కులు కేటాయించారు. ప్రశ్న పత్రంలోని 5వ వ బిట్ నందు ఇచ్చిన పత్రలేఖనానికి గాను 3 ప్రశ్నలలో ఏదేని ఒక సమాధానం రాయాలి. దీనికి 1x5 = 5 మార్కులు ఉంటాయి. ఇక
ప్రశ్నాపత్రంలోని Xll , XIIl బిట్లలో సంధులకు సంబంధించిన ప్రశ్నలుంటాయి. Xll వ బిట్టులో 12 పదాలు ఇచ్చి వాటిలో ఏవేని నాలుగు పదాలు విడదీసి సంధిపేరు రాయాల్సి ఉంటుంది. దీనికి 2x4 =8 మార్కులు కేటాయించారు. XIIlవ బిట్ నందు 12 పదాలు విడదీసి ఇచ్చి వాటిలో నాలుగు పదాలు కలిపి రాసి, సంధిపేరు రాయమంటారు. దీనికి గాను 2x4 =8 మార్కులు కేటాయించారు. ప్రశ్నాపత్రంలోని XVI వ బిట్ నందు ఐదు అశుద్ధమైన వాక్యాలు ఇచ్చి వాటిని సరిచేసి రాయమంటారు. దీనికి 5 మార్కులు కేటాయించారు. పైన పేర్కొన్న విభాగాల నుంచి విద్యార్థులు అన్నీ నేర్చుకున్నట్లయితే.. సునాయాసంగా 52 మార్కులు సాధించవచ్చని కరీంనగర్ ప్రభుత్వ మహిళల జూనియర్ కళాశాల లెక్చరర్ జి.రవళి తెలిపారు.
Next Story