Sun Dec 22 2024 17:39:49 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు తెలంగాణలో ఇంటర్ పరీక్ష ఫలితాలు
తెలంగాణలో నేడు ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి
తెలంగాణలో నేడు ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈరోజు ఉదయం పదకొండు గంటలకు ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షలు విడుదల కానున్నాయి. రెండు సంవత్సరాల పరీక్ష ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.
ఈ వెబ్సైట్ లో...
తెలంగాణాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన ప్రారంభమై మార్చి 19 వతేదీ వరకూ జరిగాయి. ఇంటర్ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 9,80,978 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాల కోసం అధికారిక వెబ్ సైట్ https://tsbie.cgg.gov.in/ చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. హాల్ టిక్కెట్ ను ఎంటర్ చేస్తే ఫలితాలు కనపడతాయని అధికారులు తెలిపారు. మెమో సాప్ట్ కాపీని కూడా ప్రింట్ తీసుకునే వీలుంది.
Next Story