Mon Dec 23 2024 14:09:23 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కాంగ్రెస్ లో ఆ పార్టీ విలీనం
నేడు కాంగ్రెస్ లో తెలంగాణ ఇంటిపార్టీ విలీనం కానుంది. చెరుకు సుధాకర్ కు చెందిన పార్టీని కాంగ్రెస్ లో విలీనంచేయనున్నారు.
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చేరికలతో పాటు పార్టీ విలీనాలు కూడా జరుగుతున్నాయి. కొంతకాలం క్రితం జిట్టా బాలకృష్ణారెడ్డికి చెందిన యువ తెలంగాణ పార్టీ బీజేపీలో విలీనం అయింది. నేడు కాంగ్రెస్ లో తెలంగాణ ఇంటిపార్టీ విలీనం కానుంది. చెరుకు సుధాకర్ కు చెందిన తెలంగాణ ఇంటి పార్టీని నేడు కాంగ్రెస్ లో విలీనంచేయనున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన చెరుకు సుధాకర్ తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు. టీఆర్ఎస్ లో చేరిన అసంతృప్తికి గురై తిరిగి సొంత పార్టీని పెట్టుకున్నారు.
తెలంగాణ ఇంటి పార్టీ....
ఈరోజు ఢిల్లీలో జరిగే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ముఖ్యనేతలు హాజరుకానున్నారు. మునుగోడు ఉప ఎన్నికలు జరుగుతుందనుకుంటున్న నేపథ్యంలో తెలంగాణ ఇంటి పార్టీని విలీనం చేసుకుంటూ కాంగ్రెస్ మరింత దూకుడు పెంచిందని చెప్పాలి. రేవంత్ రెడ్డి సంప్రదింపులు జరిపి చెరుకు సుధాకర్ ను ఒప్పించి పార్టీని విలీనం చేయిస్తున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ విలీనంతో కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు.
Next Story