Fri Nov 22 2024 12:47:49 GMT+0000 (Coordinated Universal Time)
Weather Report : పగలు ఎండ - సాయంత్రం వర్షం.. రాత్రికి ఉక్కపోత
తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని వాతావరణం నెలకొంది. ఒకవైపు పగటి పూట ఎండలు మండిపోతున్నాయి. సాయంత్రానికి వర్షం పడుతుంది
తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని వాతావరణం నెలకొంది. ఒకవైపు పగటి పూట ఎండలు మండిపోతున్నాయి. సాయంత్రానికి వర్షం పడుతుంది. రాత్రికి ఉక్కపోతతో ప్రజలు అల్లాడి పోతున్నారు. ఇలా భిన్నమైన వాతావరణం రాష్ట్రంలో నెలకొంది. సాధారణంగా ఈ సీజన్ లో కొంత చలి వాతావరణం ఉండాలి. కానీ రాత్రి వేళ ఏసీలు ఆన్ చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఇలాంటి వాతావరణం కారణంగా ప్రజలు అనేక వ్యాధులు బారిన పడే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు.
వ్యాధులతో జనం...
జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులు వచ్చే అవకాశముందని వైద్యులు తెలిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఎండ కొనసాగుతుండగా, సాయంత్రానికి వర్షం కురుస్తుంది. రాత్రి వేళ ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం ఎండకు బయటకు వెళితే వడదెబ్బ తగిలే విధంగా సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. తెలంగాణ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని, త్వరలోనే వాతావరణం మారుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రధానంగా ఈ రకమైన వాతావరణంతో పిల్లలు, వృద్ధులు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వాతావరణ శాఖ ఏం చెబుతుందంటే?
ఎండ దెబ్బకు కార్లలో కూడా రోడ్లపైనే తగలపడిపోతున్నాయి. గత కొద్ది రోజులుగా ఇలాంటి వాతావరణం ఉండటంతో ఆసుపత్రులు కూడా రోగులతో కిటకిటలాడుతున్నాయి. సహజంగా అక్టోబరు నెలలో శీతలగాలులు పలకరిస్తాయి. కానీ ఇప్పుడు 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో ప్రజలు బయటకు వెళ్లేందుకు బెంబేలెత్తి పోతున్నారు. క్యుమలోనింబస్ మేఘాల వల్ల కారణంగానే ఈ భిన్న మైన వాతావరణం ఉందని వాతావరణ శాఖ పేర్కొంటుంది. మరో వారం రోజుల పాటు పరిస్థితులు ఇలాగే ఉంటాయని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
Next Story