Tue Dec 24 2024 01:08:28 GMT+0000 (Coordinated Universal Time)
లాసెట్, పీజీలా సెట్ లు జరిగే తేదీలివే
తెలంగాణ లాసెట్, పీజీ సెట్ తేదీలు ఖరారయ్యాయి. తెలంగాణలో ఈ సెట్ 2023 షెడ్యూల్ ను తెలంగాణ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది
తెలంగాణ లాసెట్, పీజీ సెట్ తేదీలు ఖరారయ్యాయి. తెలంగాణలో ఈ సెట్ 2023 షెడ్యూల్ ను తెలంగాణ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. మార్చి 1వ తేదీన లాసెట్, పీజీఎల్ సెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ పరీక్ష కోసం మే 3వ తేదీ వరకూ ఆలస్య రుసుముతో దరఖాస్తులను స్వీకరిస్తారు. మే 16వ తేదీ నుంచి లాసెట్, పీజీఎల్ సెట్ హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకునే వీలుందని అధికారులు తెలిపారు.
మే 20 తేదీన...
మే 20వ తేదీన లాసెట్, పీజీ సెట్ పరీక్షను నిర్వహించనున్నారు. అభ్యర్థులు దరఖాస్తులు ఆన్ లైన్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. మే 25న లాసెట్, పీజీ ఎంట్రన్స్ పరీక్ష ఉంటుంది. మార్చి 1వ తేదీన దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి రెండు నుంచి మే 2వ తేదీ వరకూ దరఖాస్తులను స్వీకరిస్తారు. ఆలస్యరుసుముతో ఈ పరీక్షకు సంబంధించి మే 12 వరకూ దరఖాస్తును చేసుకునే వీలుంది. మే 15వ తేదీ నుంచి హాల్ టిక్కెట్లు జారీ అవుతాయి.
Next Story