Mon Dec 23 2024 19:17:01 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో నేడు అదృష్టవంతులు ఎవరెవరవుతారో..?
మద్యం టెండర్లు అంటే ఎంతో మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో
మద్యం టెండర్లు అంటే ఎంతో మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో అందుకు ఏ స్థాయిలో రెస్పాన్స్ వస్తూ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటు ప్రభుత్వానికి భారీ ఆదాయం. ఇటు టెండర్లు పాడుకున్నాక సంపాదించుకున్న వాళ్లకు కూడా ఊహించని కలెక్షన్లు. అందుకు తగ్గట్టుగానే భారీగా టెండర్లు వచ్చాయి. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
తెలంగాణలో మద్యం దుకాణాల నిర్వహణకు సంబంధించి అధికారులు నేడు లక్కీ డ్రా నిర్వహించనున్నారు. 2023-25కు గానూ మొత్తం 2,620 మద్యం దుకాణాల కేటాయింపుల కోసం డ్రా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 34 ఎక్సైజ్ జిల్లాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. రెవెన్యూ జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో, దరఖాస్తుదారుల సమక్షంలో ఉదయం 10.30 గంటలకు దుకాణాల వారీగా డ్రా తీయనున్నారు. డ్రాలో గెలుపొందిన వారు ఈ నెల 23లోగా నిర్ణీత వార్షిక లైసెన్స్ రుసుములో ఆరో వంతు చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబరు 1 నుంచి కొత్త మద్యం దుకాణాల్లో విక్రయాలు సాగించేందుకు అనుమతించనున్నారు.
మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎలక్షన్ షెడ్యూల్ వస్తే మద్యం దుకాణాలకు టెండర్లు వేసే అవకాశం ఉండకపోవడం ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రాదనే భావనతో రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే మద్యం దుకాణాలకు వేలం వేసింది. రాష్ట్రంలో మొత్తం 2,620 మద్యం దుకాణాలు ఉండగా వీటి కోసం ఏకంగా 1,31,490 దరఖాస్తులు వచ్చాయి.
Next Story