కాంగ్రెస్లో కొలిక్కి రాని సీట్ల పంచాయతీ
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి మరింత వేడెక్కుతుంది. ఇక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి మరింత వేడెక్కుతుంది. ఇక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు దూకుడు పెంచారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు సిద్దమవుతున్నాయి. ఇక కాంగ్రెస్ కూడా అభ్యర్థుల జాబితా కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అయితే త్వరగానే కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల చేస్తామమని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే చెబుతున్నారు. ఎప్పుడనేది మాత్రం స్పష్టం చేయలేదు. సీఈసీ సమావేశానికి ముందు మరోమారు స్క్రీనింగ్ కమిటీ భేటీ ఉంటుంది. వీలైనంత త్వరగా జాబితా సిద్ధం చేస్తామన్నారు. అతి త్వరలో తొలి జాబితాను విడుదల చేస్తాం. పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ జాబితాను ఖరారు చేస్తుందన్నారు. బిసిలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తాం.. వివిధ సామాజికవర్గాల నుంచి దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ నుంచి ఒక జాబితా వచ్చింది. అన్ని వైపుల నుంచి వచ్చిన దరఖాస్తులను మేము పరిశీలించాం. అన్నివర్గాలకు తగినంత ప్రాతినిథ్యం లభించేలా చూస్తున్నాం. టికెట్ల ఖరారులో తుది నిర్ణయం పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీదే’ అని తెలిపారు మాణిక్రావు ఠాక్రే. ఇదిలా ఉంటే.. ఈలోగా టికెట్లు ఆశిస్తున్నవారు ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.