Mon Dec 23 2024 16:44:52 GMT+0000 (Coordinated Universal Time)
ఎర్రబెల్లి దయాకర్ రావు సంతకాల ఫోర్జరీ.. దేనికోసమంటే?
మంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి, మంత్రి లెటర్ హెడ్‌తో బోగస్
డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలంటూ మంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి, మంత్రి లెటర్ హెడ్‌తో బోగస్ సిఫార్స్ లేఖ తయారు చేశారు. అంతేకాకుండా సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఇచ్చేశారు. దీనిపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలంటూ సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఇటీవల పంచాయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేరుతో కొన్ని సిఫార్సు లేఖలు వచ్చాయి.
ఈ సిఫార్సు లేఖలపై మంత్రి ఎర్రబెల్లి కార్యాయలం దృష్టికి తీసుకువెళ్లారు. ఆరా తీయగా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం నర్రెగూడెం గ్రామానికి చెందిన ఎండీ. గౌస్ పాషా, గుంటి శేఖర్ వీటిని తయారు చేసినట్లు తేలింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేరుతో నకిలీ లెటర్ హెడ్‌ను తయారు చేయడంతో పాటు ఏకంగా మంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి సంగారెడ్డి కలెక్టర్‌కు సిఫార్సు లేఖలను పంపించినట్లు తేలింది.
ఈ మేరకు మంత్రి ఓఎస్డీ డా.రాజేశ్వర్‌రావు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితులు గౌస్‌పాషా, గుంటి శేఖర్‌పై ఐపీసీ 419, 420, 464, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.చాలా మందికి డబుల్ బెడ్ రూమ్ పేరుతో సిఫార్సు లేఖ ఇచ్చిన ఇద్దరు నిందితులు… మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతకాలు ఫోర్జరీ చేయడంతో అధికారులు ఆశ్చర్యపోయారు. మంత్రి ఓఎస్డీ డాక్టర్ ఎస్.ఎం.రాజేశ్వర్‌రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బంజారా హిల్స్ పోలీసులు ఆ నిందితులను అరెస్ట్ చేశారు.
Next Story