Mon Dec 23 2024 17:56:27 GMT+0000 (Coordinated Universal Time)
కేంద్రమంత్రికి ఎర్రబెల్లి సవాల్
కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కు తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సవాల్ విసిరారు
కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కు తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సవాల్ విసిరారు. దమ్ముంటే ధాన్యం కొనుగోలుపై హైదరాబాద్ లో చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు. నూక బియ్యాన్ని ఎవరు తింటారో ఇక్కడే తేల్చుకుంటామని ఎర్రబెల్లి సవాల్ చేశారు. పియూష్ గోయల్ తెలంగాణ ప్రజల మనోభావాలను కించపర్చేలా మాట్లాడారని, తెలంగాణ ప్రజలకు పియూష్ గోయాల్ క్షమాపణ చెప్పాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు.
తరిమికొట్టండి...
అలాగే మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై ఫైర్ అయ్యారు. రైతులను రెచ్చగొట్టి యాసంగిలో వరి వేసేలా వారిని ఉసిగొల్పారన్నారు. వడ్లుకొనాలని బండి సంజయ్ ఇప్పుడు కేంద్రానికి లేఖ రాస్తారన్నారు. బండి సంజయ్ గ్రామాలకు వస్తే తరిమి కొట్టాలని ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. మహారాష్ట్ర రైతులు కూడా తెలంగాణకు వచ్చి భూములు కొంటున్నారన్న విషయాన్ని ఎర్రబెల్లి గుర్తు చేశారు.
Next Story