Mon Dec 23 2024 18:34:19 GMT+0000 (Coordinated Universal Time)
నిర్మలకు హరీశ్ రావు లేఖ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. తెలంగాణకు రావాల్సిన గ్రాంట్లను వెంటనే విడుదల చేయాలని హరీశ్ రావు లేఖలో కోరారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 94 (2) ప్రకరాం వెనక బడిన ప్రాంతాల అభివృద్ధికి కేటాయించిన నిధులను రెండేళ్ల నుంచి విడుదల చేయడం లేదని పేర్కొన్నారు. ఈ నిధులు 900 కోట్ల రూపాయలు విడుదల కావాల్సి ఉందని హరీశ్ రావు లేఖలో పేర్కొన్నారు.
ఆ గ్రాంట్ల విషయంలో....
దీంతో పాటు ఈ గ్రాంట్ ను 2022 తర్వాత ఐదేళ్ల పాటు పెంచాలని కూడా హరీశ్ రావు లేఖలో కోరారు. నీతి అయోగ్ సూచించిన విధంగా 24,205 కోట్ల రూపాయలను విడుడల చేయాలని, స్థానికసంస్థలకు 817 కోట్లు, పట్ణణ స్థానిక సంస్థలకు 502 కోట్లు ఇవ్వాలన్న పథ్నాలగవ ఆర్థిక సంఘం సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఎందుకు తిరస్కరించిందో చెప్పాలని హరీశ్ రావు తన లేఖలో నిర్మలా సీతారామన్ ను కోరారు.
Next Story