Mon Dec 23 2024 18:47:27 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై కేటీఆర్ లేఖ
తెలంగాణ మంత్రి కేటీఆర్ విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
తెలంగాణ మంత్రి కేటీఆర్ విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వర్కింగ్ క్యాపిటల్, నిధుల సమీకరణ పేరుతో ప్రయివేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నం జరుగుతుందని, ఆ ప్రయత్నాలను విరమించుకోవాలని కేటీఆర్ తన లేఖలో కోరారు. కార్పొరేట్ మిత్రుల కోసం 1.25 లక్షల కోట్లను మాఫీ చేసిన మోదీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ పట్ల ఎందుకు ఔదార్యం చూపడం లేదని కేటీఆర్ తన లేఖలో ప్రశ్నించారు.
ప్లాంట్‌ను ప్రయివేటీకరించే...
ప్లాంట్‌ను ప్రయివేటీకరించే ఆలోచనను విరమించుకోవాలని కేటీఆర్ లేఖలో కోరారు. కేంద్రమే వర్కింగ్ క్యాపిటల్‌ను ఎందుకు ప్లాంట్‌కు ఇవ్వకూడదని ఆయన నిలదీశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయ్యే స్టీల్‌ను కొనుగోలు చేయాలని, ముడిసరుకు కూడా దానికి కేటాయించాలని కేటీఆర్ కోరారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఆలోచన మానుకుని, ఐదువేల కోట్ల రూపాయలు కేటాయించాలని లేఖలో కోరారు. కేంద్రమే వర్కింగ్ క్యాపిటల్ కోసం నిధులను విడుదల చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రయివేటీకరించే ఆలోచనలకు స్వస్తి చెప్పాలంటూ ఆయన తన లేఖలో కోరారు.
Next Story