Sat Feb 22 2025 09:31:59 GMT+0000 (Coordinated Universal Time)
బీఆర్ఎస్ కార్యక్రమానికి కేటీఆర్ డుమ్మా
భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ దూరంగా ఉంటున్నారు

భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ దూరంగా ఉంటున్నారు. ఆయన హైదరాబాద్ లోనే ఉన్నారు. మంత్రి కేటీఆర్ ఢిల్లీలో జరిగే కార్యక్రమానికి హాజరు కావడం లేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉండటంపై పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతుంది. రెండు ముఖ్యమైన సమావేశాలున్నందున ఆయన వెళ్లలేకపోతున్నారని తెలిపారు.
ముందుగా నిర్ణయించిన...
అయితే ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్నందున తాను బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి హాజరు కాలేకపోతున్నానని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఢిల్లీలో కేసీఆర్ నేడు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్మక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు హాజరవుతున్నారు. కానీ కేటీఆర్ మాత్రం కార్యక్రమాల కారణంగా హాజరు కావడం లేదని చెప్పారు. ఈ మేరకు తాను ఎందుకు హాజరు కావడంలేదో కేటీఆర్ ట్వీట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.
Next Story