Mon Dec 23 2024 03:40:04 GMT+0000 (Coordinated Universal Time)
నేడు సిరిసిల్ల జిల్లాకు కేటీఆర్
నేడు తెలంగాణ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
నేడు తెలంగాణ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మరికొన్ని పనులను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్దిదారులకు అందచేయనున్నారు. తర్వాత కేజీ టూ పీజీ క్యాంపస్ ఎదురుగా ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొంటారు. సాయంత్రం నాలుగు గంటలకు గంభీరావుపేటలోని లింగన్నపేట రోడ్డులో మానేరు వాగుపై వంతెనకు శంకుస్థాపన చేయనున్నారు.
అభివృద్ధి పనులను...
అనంతరం సాయంత్ర 4.30 గంటలకు లింగన్నపేట కోల్లమద్దిలో డబుల్ బెడ్ రూం ఇళ్లను లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు మన ఊరు - మన బడి కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందులో భాగంగా పలు అభివృద్ధి పనులను కేటీఆర్ ప్రారంభిస్తారని ఆయన కార్యాలయం తెలిపింది. దీంతో పాటు కొత్తపల్లి బీటీరోడ్డు నిర్మాణానికి కూడా కేటీఆర్ నేడు శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం ఆరుగంటలకు నర్యాలలో డబుల్ బెడ్ రూం ఇళ్లను కూడా ప్రారంభించనున్నారని అధికారులు తెలిపారు. కేటీఆర్ పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Next Story