Tue Mar 18 2025 14:35:48 GMT+0000 (Coordinated Universal Time)
లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన మంత్రి
కొద్దిసేపటి తర్వాత ఆయన లిఫ్ట్ లో నుంచి సురక్షితంగా బయటకు రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

తెలంగాణ ఎక్సైజ్ శాఖమంత్రి శ్రీనివాస్ గౌడ్ ఓ రెస్టారెంట్ లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. దాంతో ఆయన అనుచరులు, బీఆర్ఎస్ శ్రేణులు, సెక్యూరిటీ సిబ్బంది కంగారుపడ్డారు. కొద్దిసేపటి తర్వాత ఆయన లిఫ్ట్ లో నుంచి సురక్షితంగా బయటకు రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా నిన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ నుంచి మంచిర్యాలకు పయనమయ్యారు. దారిమధ్యలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ తో కలిసి పెద్దపల్లిలో పర్యటించారు.
ఈ క్రమంలో పెద్దపల్లి చౌరస్తాలోని ఓ బిఆర్ఎస్ నాయకుడు నిర్వహిస్తోన్న రెస్టారెంట్ కు మంత్రి విచ్చేశారు. కొద్దిసేపు అక్కడే ఉన్న మంత్రి.. పై నుండి భవనం కిందికి వచ్చేందుకు లిఫ్ట్ ఎక్కారు. అదే సమయంలో సాంకేతిక సమస్యతో లిఫ్ట్ ఆగిపోయింది. మంత్రి లిఫ్ట్ లో ఉండగానే లిఫ్ట్ ఆగిపోవడంతో అందరూ కంగారుపడ్డారు. చివరకు పోలీసులు వచ్చి లిఫ్ట్ తలుపులు తెరువగా మంత్రి, ఆయనతో పాటు ఉన్నవారంతా క్షేమంగా బయటికొచ్చారు. పెద్దపల్లి గుర్తుండిపోతుంది.. అని నవ్వుకుంటూ కారులో చెన్నూరుకు వెళ్లారు.
Next Story