Sun Dec 22 2024 11:42:15 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : 29న మేడిగడ్డకు మంత్రులు
ఈ నెల 29వ తేదీన తెలంగాణ మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబులు మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించనున్నారు
ఈ నెల 29వ తేదీన తెలంగాణ మంత్రులు మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించనున్నారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబులు మేడిగడ్డ ప్రాజెక్టు కు చేరుకుంటారు. అక్కడ కూలిన ప్రాంతాన్ని పరిశీలిస్తారు. అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడానికి కారణాలపై అధికారులతో ప్రత్యేకంగా చర్చిస్తారు.
పవర్ పాయింట్ ప్రెజెంటేషన్...
అనంతరం మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేయనున్నారు. మంత్రులు ప్రాజెక్టు వ్యయంతో పాటు కూలిపోయిన కారణాలను వివరించారు. ప్రాణహిత ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టుల వివరాలు.. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల జరిగిన లాభ, నష్టాలు.. ప్రాజెక్టు వ్యయం.. కొత్త ఆయకట్టు, స్థిరీకరణ ఆయకట్టు వివరాలు వెల్లడించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story