Mon Dec 23 2024 14:40:53 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఢిల్లీకి మంత్రుల బృందం
తెలంగాణ మంత్రులు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర మంత్రులను కలవనున్నారు
తెలంగాణ మంత్రులు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఈ మేరకు పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్ లను కోరినట్లు తెలిసింది. యాసంగి ధాన్యాన్ని వంద శాతం కొనుగోలు చేయాలంటూ త్వరలోనే టీఆర్ఎస్ నేతృత్వంలో ఉద్యమం జరగనున్న నేపథ్యంలో మంత్రుల పర్యటన సాగనుంది. నిన్న జరిగిన టీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశంలో కేసీఆర్ మంత్రుల బృందం పర్యటినను ఖరారు చేశారు.
యాసంగి ధాన్యం....
కేంద్ర మంత్రులను కలసి యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రంపై వత్తిడి తేవాలని నిర్ణయించారు. ఇందుకోసం మంత్రుల బృందం నేడు ఢిల్లీకి బయలుదేరనుంది. మూడు రోజులు అక్కడే ఉండి కేంద్ర మంత్రులను కలసి రాష్ట్ర సమస్యలపై వినతి పత్రాలను ఇచ్చి వస్తారని తెలిసింది. మరో వైపు పార్లమెంటులోనూ టీఆర్ఎస్ యాసంగి ధాన్యం కొనుగోలుపై ఆందోళన చేయనుంది.
Next Story