Sat Dec 21 2024 11:14:38 GMT+0000 (Coordinated Universal Time)
రేవంత్ యాత్రకు ఐదు రోజుల బ్రేక్
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రకు ఐదు రోజులు విరామం ప్రకటించారు.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రకు ఐదు రోజులు విరామం ప్రకటించారు. ఆయన ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. గత నెల రోజులుకు పైగానే పాదయాత్ర చేస్తున్న రేవంత్ రెడ్డి ఐదురోజుల పాటు విరామం ప్రకటించారు. రేవంత్ తన పాదయాత్రలో ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటూ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తూ వెళుతున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీలో...
ఐదు రోజుల పాటు పాదయాత్రకు విరామం ప్రకటించిన రేవంత్ రెడ్డి ఈ నెల 23వ తేదీన సిట్ అధికారుల ఎదుట హాజరుకానున్నారు. టీ.ఎస్.పీ.ఎస్.సి. ప్రశ్నాపత్రాల లీకేజీ విషయంలో తన వద్ద ఉన్న ఆధారాలను అందించనున్నారు. ఇప్పటికే సిట్ అధికారులు రేవంత్ కు నోటీసులు అందించిన సంగతి తెలిసిందే. ఈ నెల 24, 25వ తేదీల్లో రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సీటీలో నిరుద్యోగ దీక్ష చేయాలని తలపెట్టారు. ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే ఈ నెల 26వ తేదీన జుక్కల్ లో తిరిగి రేవంత్ రెడ్డి పాదయాత్ర జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ నేతలు తెలిపారు.
Next Story