Fri Nov 22 2024 05:16:10 GMT+0000 (Coordinated Universal Time)
నేడు రేవంత్ నిరుద్యోగ దీక్ష
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు దీక్షకు దిగనున్నారు. గాంధారి మండల కేంద్రంలో దీక్ష చేస్తారు
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు దీక్షకు దిగనున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి మండల కేంద్రంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరుద్యోగ నిరసన దీక్ష చేయనున్నారు. కేసీఆర్ తెలంగాణ మోడల్ పేరుతో దేశ వ్యాప్తంగా పార్టీని విస్తరించుకునే ప్రయత్నం చేస్తున్నారని, తెలంగాణ మోడల్ అంటే.. మినిమం గవర్నెన్స్.. మాక్సిమం పాలిటిక్స్ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ కష్టపడి పారదర్శక విధానం తెస్తే... కేసీఆర్ దాన్ని నిర్వీర్యం చేశారన్నారు. తెలంగాణలో అత్యంత బాధ్యతారాహిత్యమైన వ్యక్తి కేసీఆర్ అని ఆయన అన్నారు. టీఎస్పీఎస్సీ పరీక్షల్లో ప్రశ్న పత్రం లీకేజీ అంశంలో మొదట హానీ ట్రాప్ అని, రెండోసారి హాకింగ్ జరిగిందని, తరువాత లీకయిందని చెప్పారు.
లీకుల ప్రభుత్వమే...
నిజాలు బయటకు వస్తుండటంతో పరీక్షలను రద్దు చేశారని రేవంత్ అన్నారు. లీకేజీ అంశంలో ఇద్దరిలో ఒకరు బీజేపీకి చెందిన వ్యక్తి అని బీఆర్ఎస్ చెబుతోందని, మరొకరు బీజేపీ అంటున్నారన్నారు. మంత్రి కేటీఆర్ తోండి వాదనకు దిగుతున్నారన్నారు. రెండో ముద్దాయి బీఆరెస్ వాళ్లని బీజేపీ చెబుతోంది. బీఆరెస్, బీజేపీ లు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 2015లో సింగరేణి ఉద్యోగాల భర్తీ చేసేందుకు జరిగిన పరీక్షల్లో పేపర్ లీక్ అయిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కవితకు కూడా అందులో భాగస్వామ్యం ఉందని ఆనాడు ఆరోపణలు వచ్చాయన్నారు. 2016లో ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకైందని, మూడు సార్లు అభ్యర్థులు ఎంసెట్ పరీక్ష రాయాల్సి వచ్చిందని తెలిపారు.
Next Story