Thu Mar 13 2025 22:30:51 GMT+0000 (Coordinated Universal Time)
Electricity Charges : హమయ్య దీపావళికి ముందే ప్రజలకు గుడ్ న్యూస్..ఇక కరెంట్ షాక్ లేనట్లే
తెలంగాణ ప్రజలకు దీపావళికి ముందే గుడ్ న్యూస్ అందింది. ఈసారి విద్యుత్తు ఛార్జీలు ఇక తెలంగాణలో పెంచడం లేదని ప్రకటన వచ్చింది

తెలంగాణ ప్రజలకు దీపావళికి ముందే గుడ్ న్యూస్ అందింది. ఈసారి విద్యుత్తు ఛార్జీలు ఇక తెలంగాణలో పెంచడం లేదని ప్రకటన వచ్చింది. విద్యుత్తు ఛార్జీలను ఏ కేటగిరీలోనూ పెంచబోమని, ఛార్జీల పెంపుదల లేదని ఈఆర్సీ ఛైర్మన్ రంగారావు వెల్లడించారు. దీంతో ఈ ఏడాది తెలంగాణలో విద్యుత్తు ఛార్జీల పెంపుదల ఉండదని స్పష్టమయింది. దీంతో ప్రజలు కూడా ఊపిరిపీల్చుకున్నారు. అన్ని పిటిషన్లపై ఎలాంటి ల్యాప్స్ లేకుండా వెల్లడించాలని నిర్ణయించిందని తెలిపారు. ఎనర్జీ ఛార్జీలు కూడా ఏ కేటగిరీలోనూ పెంచడం లేదని తెలిపారు. ప్రభుత్వ సబ్సిడీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. స్థిర ఛార్జీలు పది రూపాయలు మాత్రం యథాతథంగా ఉంటుందని ఆయన తెలిపారు.
పీక్ అవర్ లో కూడా...
దీంతో పాటు రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకూ నాన్ పీక్ అవర్ లో రూపాయి నుంచి 1.50 రూపాయలకు రాయితీని పెంచామని ఈఆర్సీ ఛైర్మన్ రంగారావు తెలిపారు. చేనేత కార్మికులకు హార్స్ పవర్ కూడా పెంచామన్న ఆయన గృహ వినియోగదారులకు మినిమం ఛార్జీలను తొలగించామని తెలిపారు. గ్రిడ్ సపోర్ట్, ఛార్జీలు కమిషన్ ఆమోదించిందని ఆయన వివరించారు. 11,499 కోట్లు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చిందన్న ఆయన 1800 కోట్ల ప్రతిపాదనలు ఇచ్చారని, డిస్కంలు వేసిన పిటీషన్ లో 57,728 పేర్కొంటే ఈఆర్సీ 54,183 కోట్లు ఆమోదించినట్లు ఆయన వివరించారు. ఈ ఏడాది తెలంగాణలో విద్యుత్తు ఛార్జీలు పెంచడం లేదని స్పష్టం చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నట్లయింది.
Next Story