Tue Nov 05 2024 16:43:26 GMT+0000 (Coordinated Universal Time)
గద్దర్ మరణానికి కారణమదే.. అంత్యక్రియలు అక్కడే
ప్రజా గాయకుడు గద్దర్ మరణవార్త విని తెలుగు ప్రజలు షాక్ అవుతున్నారు. బీపీ పెరగడంతో
ప్రజా గాయకుడు గద్దర్ మరణవార్త విని తెలుగు ప్రజలు షాక్ అవుతున్నారు. బీపీ పెరగడంతో పాటు షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పడిపోవడంతో వైద్యులు చికిత్స అందించారు. ఆ తర్వాత శరీరంలో అవయవాలు దెబ్బతినడంతో గద్దర్ ప్రాణాలు విడిచినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. ఊపిరితిత్తులు, మూత్ర సంబంధిత సమస్యలు, వయోభారం కారణంగా అమీర్‌పేటలోని అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో గద్దర్ కన్నుమూశారు.ఆయన తీవ్రమైన గుండె జబ్బుతో బాధపడుతూ జులై 20, 2023న ఆస్పత్రిలో చేరారని, ఆగస్టు 3, 2023న బైపాస్ సర్జరీ చేయించుకున్నారని వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం ఆయన కోలుకున్నారని.. అయినప్పటికీ గతంలో ఊపిరితిత్తులు, మూత్ర సంబంధిత సమస్యలతో బాధపడ్డారని వైద్యులు తెలిపారు.
ఆల్వాల్‌లోని గద్దర్ స్థాపించిన స్కూల్లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఎల్బీ స్టేడియం నుంచి అంతిమయాత్ర ప్రారంభమై సికింద్రాబాద్ మీదుగా ఆల్వాల్ వరకు అంతిమయాత్ర కొనసాగనుంది. భూదేవి నగర్‌లోని గద్దర్ ఇంట్లో కొద్దిసేపు పార్థివదేహాన్ని ఉంచుతామని కుటుంబ సభ్యులు తెలిపారు. మహాబోధి విద్యాలయంలో అంత్యక్రియలు నిర్వహించాలని భార్య విమల సూచించారు.
Next Story