Mon Dec 23 2024 13:44:19 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : వైఎస్ షర్మిల అరెస్ట్
ఆదివారం టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డిపై షర్మిల చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ నేతలను తీవ్ర ఆగ్రహానికి..
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం శంకరం తండా వద్ద షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంకరం తండా వద్ద షర్మిల కాన్వాయ్ పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి దిగడంతో.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలో పోలీసులకు, వైఎస్సార్ తెలంగాణ పార్టీ శ్రేణులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దాంతో పోలీసులు వైఎస్ షర్మిలను అదుపులోకి తీసుకున్నారు.
ఆదివారం టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డిపై షర్మిల చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ నేతలను తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. టీఆర్ఎస్ కార్యకర్తలు వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఫ్లెక్సీలను చించివేశారు. షర్మిల కాన్వాయ్ లోని ఓ వాహనాన్ని ధ్వంసం చేశారు. దానిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. నర్సంపేటలో షర్మిల పాదయాత్ర కొనసాగుతుండగా.. పాదయాత్రలో భారీగా పోలీసులు మోహరించడంతోనే ఆమెను అరెస్ట్ చేస్తారా ? అన్న ఊహాగానాలు మొదలయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం పోలీసులను తమ పనోళ్ళలా వాడుకుంటోందని షర్మిల విమర్శించారు.
- Tags
- ysrtp
- ys sharmila
Next Story