Sun Dec 22 2024 16:31:55 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : పది వేల డ్రైవింగ్ లైసెన్సులు రద్దు
తెలంగాణ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పది వేల డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేశారు
తెలంగాణ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ లో పాటు జిల్లాల్లో ట్రాఫిక్ నిబంధనలను పాటించని వారిపై కొరడా ఝుళిపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమిస్తున్న వారిపై ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10,113 మంది డ్రైవింగ్ లైసెన్స్ లను 6 నెలల పాటు రద్దు చేసినట్లు పోలీసులు తెలిపారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ లో...
రద్దు చేసిన లైసెన్స్ లలో దాదాపు 70 శాతం డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన మద్యం తాగి నడిపినందున వారి లైసెన్సులను రద్దుచేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో పాటు నిబంధనలను పాటించకుండా ట్రాఫిక్ రూల్స్ ను లెక్క చేయకుండా వాహనాలను నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
Next Story