గజ్వేల్ లో కేసీఆర్ పై పోటీ?
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ పార్టీలను చిత్తు చేయడానికి తన ప్రణాళికల్లో తాను ఉన్నారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు మారుతూ ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నే ఓడించాలని ప్రణాళికలు రచిస్తూ ఉన్నాయి ప్రతి పక్షాలు. గజ్వేల్ నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేయాలని భావిస్తూ ఉన్నారని తెలుస్తోంది. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పోటీ తీవ్రంగా ఉండనుంది. కర్ణాటకలో విజయం తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఊపు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో క్షేత్ర స్థాయి నుండి బలోపేతం దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తూ ఉంది. బీఆర్ఎస్, బీజేపీలను ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక కర్ణాటకలో ఓటమిని అందుకున్నప్పటికీ ఆ ప్రభావం తెలంగాణలో ఉండదని బీజేపీ నేతలు ఎంతో కాన్ఫిడెంట్ గా చెబుతూ వస్తున్నారు. బీఆర్ఎస్ ను ఎదుర్కోడానికి కాంగ్రెస్, బీజేపీలు సర్వసన్నద్ధం అవుతూ ఉన్నాయి.