Mon Dec 23 2024 08:05:25 GMT+0000 (Coordinated Universal Time)
మల్లు స్వరాజ్యం భౌతికకాయానికి ప్రముఖుల నివాళి
మల్లు స్వరాజ్యం పేదల కోసం పోరాడారని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో మల్లు స్వరాజ్యం సాహసం..
హైదరాబాద్ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం హైదరాబాద్ లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం కన్నుమూసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె భౌతికకాయం హైదరాబాద్ లోని ఎంబీ భవన్ లో ఉంది. గవర్నర్ తమిళిసై, మంత్రి ఎర్రబెల్లి, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, ఎమ్మెల్సీ కవిత, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మల్లు స్వరాజ్యం భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.
మల్లు స్వరాజ్యం పేదల కోసం పోరాడారని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో మల్లు స్వరాజ్యం సాహసం ఎందరికో స్పూర్తి అని తెలంగాణ గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. మల్లు స్వరాజ్యంపేరిట పుస్తకాలు, సినిమాలు రావాలని,పేదల కోసం మల్లు స్వరాజ్యం వీరోచిత పోరాటాలు చేశారని కోదండరాం అన్నారు. మల్లు స్వరాజ్యం భౌతికకాయాన్ని కాసేపట్లో నల్లగొండకు తరలిస్తారు. అక్కడి పార్టీ కార్యాలయంలో సంతాప సభ నిర్వహించిన అనంతరం ఆమె భౌతికకాయాన్ని మెడికల్ కాలేజీకి అప్పగిస్తారు.
Next Story