ఈసారి పొత్తులకు బీఆర్ఎస్ దూరం ? సింగిల్ గా గెలుస్తుందా ?
నవంబర్ 2022లో జరిగిన మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో, బీజేపీని ఓడించడానికి BRS వామపక్షాలతో ముందస్తు ఎన్నికల
డిసెంబర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ముందస్తు ఎన్నికల పొత్తుపై అధికార బీఆర్ఎస్ ఆసక్తి చూపడం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. BRS అధ్యక్షుడు, ముఖ్యమంత్రి K. చంద్రశేఖర రావు పార్టీ మొత్తం 104 మంది ఎమ్మెల్యేలను, పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు, మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలని కోరినట్లు తెలుస్తోంది. అవసరమైతే ఎన్నికల అనంతర పొత్తులను పార్టీ పరిశీలిస్తుందని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ పొత్తు లేకుండా అన్ని స్థానాల్లో పోటీ చేసి రెండు పర్యాయాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఏడాది కూడా గెలిచి తమ పార్టీ ‘హ్యాట్రిక్’ విజయాన్ని అందుకుంటుందని, సొంతంగా ఆ ఘనత సాధించాలని భావిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని ఇతర పార్టీలతో పోలిస్తే బీఆర్ఎస్ ప్రస్తుతం పొలిటికల్ గా స్ట్రాంగ్ గా కనిపిస్తూ ఉంది.