Mon Dec 23 2024 12:10:36 GMT+0000 (Coordinated Universal Time)
అప్పుడే షర్మిలకు పొగపెడుతున్నారే?
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారనే
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారనే ప్రచారం సాగుతూ ఉంది. షర్మిలను తెలంగాణ కాంగ్రెస్ లోకి ఆహ్వానించే వాళ్లు కొందరైతే.. ఆమెను వద్దని అంటున్న వాళ్లు ఇంకొందరు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి వైఎస్ షర్మిలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుర్పించారు. ఇన్నాళ్లకు తెలంగాణ కోడలు అని గుర్తొచ్చిందా? అంటూ ప్రశ్నించారు. షర్మిల తెలంగాణ కోడలు అయితే.. నేను ఖమ్మం జిల్లా ఆడబిడ్డను అన్నారు. ఖమ్మం జిల్లాలో రాజకీయాలపై తన అభిప్రాయం కూడా కీలకమేనని.. నాకు ఆంధ్రలో ఎంత హక్కు ఉందో.. ఇక్కడ షర్మిలకూ అంతేనన్నారు. అసలు కాంగ్రెస్లోకి వచ్చేవారు షర్మిల ఒక్కరేనా, ఇంకా ఎవరైనా మిగిలారా అని ఎద్దేవా చేశారు.
వైఎస్ షర్మిల పాలేరు నుండి పోటీ చేయాలని అనుకుంటూ ఉండగా.. దానిపై కూడా తెలంగాణలో చర్చ జరుగుతూ ఉంది. ఈ సీటు విషయమై కాంగ్రెస్ అధిష్టానంతో షర్మిల చర్చలు జరిపినట్లు కూడా ప్రచారం సాగింది. "షర్మిల పాలేరులో పుట్టారా? పాలేరు నుంచి పోటీ చేస్తానని చెప్పడానికి షర్మిల ఎవరు? మా నాయకత్వం మాకు చెప్పాలి, ”అని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం గాంధీభవన్లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. అమరావతి రైతుల గురించి మాట్లాడాలని రేణుక అన్నారు. కాంగ్రెస్లో షర్మిల ఏ స్థానానైనా అడగొచ్చు.. అడిగేందుకు ట్యాక్స్ లేదు కదా అని అన్నారు. వైఎస్ షర్మిల పార్టీని విలీనం చేసుకోవాలా? వద్దా? అనే విషయాన్ని ఇంకా అధిష్ఠానం తేల్చ లేదని, అప్పుడే సొంత నిర్ణయాలను తీసుకోవడం సరికాదని రేణుకా చౌదరి అన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలిశారంతే నని, పొత్తులు, విలీనం అనే విషయాలేవీ ప్రస్తావనకు రాలేదని అంటున్నారు రేణుకా చౌదరి.
Next Story