తీగల కృష్ణారెడ్డి పార్టీ మారడం వెనుక ఇంత పెద్ద కథా!
2014లో టీడీపీ తరపునే పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి మీద విజయం సాధించారు. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరిన
కాంగ్రెస్ పార్టీలోకి మరో కీలక నేత వచ్చి చేరాడు. మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి అడుగుపెడుతున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో తీగల విడివిడిగా చర్చలు జరిపినట్లు సమాచారం.కృష్ణారెడ్డితో పాటు ఆయన కోడలు, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితారెడ్డి కూడా కాంగ్రెస్ లోకి వెళ్లనున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు, తీగల ఇంతవరకు ధ్రువీకరించలేదు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ లో ఉండడంతో వచ్చే ఎన్నికల్లో మహేశ్వరం టికెట్ దక్కదని కృష్ణారెడ్డి అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. తీగలను చేర్చుకునేందుకు కాంగ్రెస్ కూడా సంప్రదింపులు జరుపుతున్నారు కూడా అని కథనాలు వినిపిస్తూ ఉన్నాయి.ప్రస్తుతం తీగల కృష్ణారెడ్డి కోడలు అనితా రెడ్డి.. రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు.