Mon Dec 23 2024 18:26:57 GMT+0000 (Coordinated Universal Time)
Congress : కేసీఆర్ పై థాక్రే ఫైర్
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఇన్ ఛార్జి మాణిక్రావు థాక్రే బీఆర్ఎస్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఇన్ ఛార్జి మాణిక్రావు థాక్రే బీఆర్ఎస్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ కోసం పన్నెండువందల మంది యువకులు ప్రాణత్యాగం చేశారన్నారు. తెలంగాణలోని ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని భావించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా అది జరగలేదన్నారు. కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ నిర్మాణం కోసం సోనియా గాంధీ మాట ఇచ్చారని, మాట నిలబెట్టుకున్నారని అన్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబం ఒక్కటే బాగుపడిందని పేర్కొన్నారు.
అమరులను పట్టించుకోకుండా...
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో 60 శాతం కేసీఆర్ కుటుంబం చేతుల్లోనే ఉందన్నారు. తెలంగాణ కోసం త్యాగాలు ప్రజలవి, బోగాలు కేసీఆర్ కుటుంబానివని ఆయన ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్ని తప్పులను సరిచేస్తామని చెప్పిన ఆయన పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ అమరవీరుల కుటుంబాలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ద్రోహులెవరో? ఉద్యమకారులెవరో తెలుసుకోవాలని విఠల్ కోరారు. బేషరతుగా కాంగ్రెస పార్టీకి మద్దతిస్తున్నామని తెలిపారు.
Next Story