Mon Nov 25 2024 11:47:36 GMT+0000 (Coordinated Universal Time)
‘ఉమన్ ఇన్ ఎడ్యుకేషన్ లీడర్స్’ పురస్కారానికి ఎంపికైన తెలంగాణ ప్రొఫెసర్ పద్మజ
ఇందిరా పారిఖ్ 1943 ఆగస్టు 29న గుజరాత్లోని కచ్ జిల్లాలోని కొట్టా అనే చిన్న గ్రామంలో జన్మించారు. ఆమె ఇండియన్..
ముంబైలో గురువారం జరిగిన 12వ ఎడ్యుకేషన్ కాంగ్రెస్ లో ప్రొఫెసర్ ఇందిరా పారిఖ్ ‘ఉమన్ ఇన్ ఎడ్యుకేషన్ లీడర్స్’ పురస్కారానికి వ్యవసాయ విశ్వవిద్యాలయం సీనియర్ ప్రొఫెసర్ పద్మజ ఎంపికయ్యారు. ప్రొఫెసర్ ఇందిరా పారిఖ్ చేతుల మీదుగా ఆమె ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రొఫెసర్ పద్మజ ప్రస్తుతం జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విద్యాలయంలో అగ్రికల్చరల్ పాలిటెక్నిక్స్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.
ఇందిరా పారిఖ్ 1943 ఆగస్టు 29న గుజరాత్లోని కచ్ జిల్లాలోని కొట్టా అనే చిన్న గ్రామంలో జన్మించారు. ఆమె ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ మాజీ డీన్. మహిళలు, విద్య, హెచ్ఆర్ల పట్ల ఆమె చేసిన కృషికి పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. 2001లో నిర్వహణలో ఉత్తమ ఉపాధ్యాయునికి జీవితకాల సాఫల్య పురస్కారం, 2003 లో HRకి చేసిన కృషికి జీవితకాల సాఫల్య పురస్కారం, 2008లో లీడర్షిప్ అవార్డు, 2009 ఎగ్జాంప్లరీ లీడర్ అవార్డు, 2010లో జీవితకాల సాఫల్యం మరియు దశాబ్దపు ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు, 2011లో జీవితకాల సాఫల్య పురస్కారం, విజనరీ లీడర్ అవార్డు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అవార్డు, 2012లో ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు, 2013లో ఇన్నోవేటివ్ లీడర్ అవార్డు, 2014లో విద్యకు లెజెండరీ కంట్రిబ్యూషన్ కోసం అవార్డు, అత్యుత్తమ మహిళా లీడర్షిప్ అచీవ్మెంట్ అవార్డులు అందుకున్నారు. అలాంటి వ్యక్తి చేతుల మీదుగా ‘ఉమన్ ఇన్ ఎడ్యుకేషన్ లీడర్స్’ అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందని ప్రొఫెసర్ పద్మజ పేర్కొన్నారు.
Next Story