Fri Dec 20 2024 13:55:21 GMT+0000 (Coordinated Universal Time)
నేడు మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటన
మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిని నేడు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ప్రకటించనున్నారు
మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిని నేడు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ప్రకటించనున్నారు. మునుగోడులో జరిగే ప్రజాదీవెన సభలో ఆయన అభ్యర్థిని ప్రకటించే అవకాశముంది. మునుగోడు ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమయింది. ఈ ఎన్నికకు టీఆర్ఎస్ సిద్ధమయింది. మునుగోడులో ఈరోజు ప్రజా దీవెన పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది.
ర్యాలీగా బయలుదేరి...
ఈ సభలోనే టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేది తెలియనుంది. సభలో ప్రజలకు అభ్యర్థిని కేసీఆర్ ప్రజలకు పరిచయం చేయనున్నారు. నవంబరు నెలలో మునుగోడు ఉప ఎన్నిక వస్తుందని భావిస్తున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి కేసీఆర్ రోడ్డు మార్గంలో మునుగోడుకు వెళతారు. ర్యాలీగా మునుగోడుకు చేరుకుంటారు. అక్కడ స్థానిక నేతలతో కేసీఆర్ సమావేశమవుతారు. అనంతరం ఆయన బహిరంగ సభలో పాల్గొంటారు.
Next Story