Wed Dec 25 2024 19:35:31 GMT+0000 (Coordinated Universal Time)
రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరణ
పార్లమెంటులో నేడు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర సమితి నిర్ణయం తీసుకుంది.
పార్లమెంటులో నేడు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర సమితి నిర్ణయం తీసుకుంది. ఈ విధంగా తమ నిరసనను కేంద్ర ప్రభుత్వానికి తెలియచేయాలని నిశ్చయించింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా తాము రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్లు టీఆర్ఎస్ ఎంపీలు తెలిపారు.
రేపటి నుంచి....
రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలకు టీఆర్ఎస్ ఎంపీలు హాజరవుతారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలతో పాటు, విభజన అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. తాము అధికారంలోకి వచ్చిన ఏడేళ్లలో తొలి సారి టీఆర్ఎస్ రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిందని వారు గుర్తు చేస్తున్నారు.
Next Story