Fri Nov 22 2024 16:19:34 GMT+0000 (Coordinated Universal Time)
నేడు విద్యుత్తు వినియోగం రికార్డ్ బ్రేక్
తెలంగాణలో ఈరోజు అత్యధికవిద్యుత్తు డిమాండ్ నమోదయింది. రికార్డు స్థాయిలో విద్యుత్తు వినియోగం అయినట్లు అధికారులు తెలిపారు
తెలంగాణలో ఈరోజు అత్యధికంగా విద్యుత్తు డిమాండ్ నమోదయింది. రికార్డు స్థాయిలో విద్యుత్తు వినియోగం అయినట్లు విద్యుత్తు శాఖ అధికారులు తెలిపారు. 15,062 మెగా వాట్ల విద్యుత్తు ఈ ఒక్కరోజు వినియోగం అయినట్లు చెబుతున్నారు. వేసవి తీవ్రత పెరగడం, ఉక్కబోత ఎక్కువగా ఉండటంతో విద్యుత్తు వినియోగం పెరిగింది. దీంతో పాటు వర్క్ ఫ్రం హోం నడుస్తుండటం కూడా ఒక కారణమని విద్యుత్తు శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
రెండో వారంలోనే...
మార్చి రెండో వారంలోనే ఇంత విద్యుత్తు వినియోగమైతే మే నాటికి మరింత పెరిగే అవకాశముందని తెలిసింది. తెలంగాణ పగలు ఉక్కబోత, రాత్రిపూట కొంత చల్లగాలులు వీస్తున్నాయని, అయినా విద్యుత్తు వినియోగం రోజరోజుకూ పెరుగుతుండటంతో అందుకు అనుగుణంగా నిరంతర విద్యుత్తు సరఫరా ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
Next Story