Mon Dec 23 2024 12:34:43 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : అరుణాచలం వెళ్లే వారికి గుడ్ న్యూస్ .. తక్కువ ఖర్చులో?
కార్తీక పౌర్ణమికి అరుణాచలం వెళ్లే వారికి తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది.
కార్తీక పౌర్ణమికి అరుణాచలం వెళ్లే వారికి తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. సాధారణంగా అరుణాచలంకు కార్తీక పౌర్ణమికి వెళ్లేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. కార్తీక పౌర్ణమి రోజు అరుచలేశ్వరుడిని దర్శించుకుని, గిరి ప్రదిక్షిణ చేస్తే పుణ్యమని ఎక్కువ మంది భక్తులు విశ్విసిస్తారు. దీంతో అరుణాచలం వివిధ మార్గాల్లో వెళ్లేందుకు భక్తులు శ్రమిస్తుంటారు. తమిళనాడులోని అరుణాచలం వెళ్లేందుకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. తెలంగాణలోని అనేక ప్రాంతాల నుంచి ఈ ప్రత్యేక బస్సులను నడుపుతుంది.
తెలంగాణలోని అనేక ప్రాంతాల నుంచి...
హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్. నల్లగొండ, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రాల నుంచి ఈ ప్రత్యేక బస్సులను టీజీ ఆర్టీసీ నడుపుతుంది. ఈ నెల 15వ తేదీన కార్తీక పౌర్ణమి కాగా, 13వ తేదీ నుంచి ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయి. మధ్యలో కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ ను కూడా దర్శించుకునే వీలుంది. ముందుగా ఈ ప్యాకేజీ కింద బుక్ చేసుకోవచ్చని టీజీఎస్ఆర్టీసీ తెలిపింది. వివరాలకు 040-69440000, 040-23450033 నెంబర్లకు కాల్ చేయవచ్చని టీజీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు.
Next Story