Mon Dec 23 2024 09:58:54 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ ఆర్టీసీ రికార్డు బ్రేక్
తెలంగాణ ఆర్టీసీకి రికార్డు స్థాయి ఆదాయం ఒక్కరోజులోనే లభించింది. సోమవారం ఒక్కరోజే 15.59 కోట్ల రూపాయలను ఆర్జించింది
తెలంగాణ ఆర్టీసీకి రికార్డు స్థాయి ఆదాయం ఒక్కరోజులోనే లభించింది. సోమవారం ఒక్కరోజే 15.59 కోట్ల రూపాయలను ఆర్జించింది. టిక్కెట్ల రూపంలో ఇంతటి ఆదాయం ఇటీవల కాలంలో ఎన్నడూ రాలేదని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. ఆక్యుపెన్సీ శాతం కూడా బాగా పెరిగింది. ఒక్కరోజులో ఆక్యుపెన్సీ 85.10 శాతం నమోదు కావడం ఆర్టీసీ అధికారులనే ఆశ్చర్యానికి గురి చేసింది.
ఒక్కరోజులో.....
గతంలో ఎన్నడూ ఇలా ఆదాయం ఆర్టీసీకి రాలేదని అధికారులు చెబుతున్నారు. సోమవారం ఒక్కరోజు తెలంగాణ ఆర్టీసీ 34.69 లక్షల కిలోమీటర్ల మేరకు బస్సులు నడిపారు. 34.17 లక్షల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేశారు. దీంతో 15.59 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రయాణికులు ఆర్టీసీని ఆదరిస్తే త్వరలోనే నష్టాల్లో నుంచి బయటపడుతుందని, ప్రజలు కూడా ప్రయివేటు వాహనాలంటే భయపడిపోతూ ఆర్టీసీ బస్సులనే ఆశ్రయిస్తున్నారని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
Next Story