Mon Dec 23 2024 06:56:20 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్టీసీలో వారికి ఉచిత ప్రయాణం
తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన వారికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది.
తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన వారికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రికి వచ్చి చికిత్స చేయించుకుని తిరిగి వెళ్లడానికి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్బంగా ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది.
చీటీ చూపించి...
ఆరోగ్య సమస్యలతో తార్నాక ఆసుపత్రికి వచ్చి తిరిగి వెళ్లేవారు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. తార్నాక ఆసుపత్రి వైద్యులు రాసి ఇచ్చిన ప్రిస్కిప్షన్ చూపిస్తే ఉచిత ప్రయాణం కల్పిస్తారు. రెండు గంటల వరకూ ఈ ప్రయాణం నగరంలో ఉచితమని ఆర్టీసీ వర్గాలు వెల్లడించాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు కూడా ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోవచ్చని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది.
Next Story