Mon Dec 23 2024 17:24:00 GMT+0000 (Coordinated Universal Time)
మరో కీలక నిర్ణయం తీసుకున్న టీఎస్ ఆర్టీసీ
రాష్ట్రంలో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతుండటంతో తెలంగాణ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది
రాష్ట్రంలో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతుండటంతో తెలంగాణ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మారి వ్యాప్తిని కొంతమేరకైనా తగ్గించాలన్న ప్రయత్నంతో.. ఇకపై ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే ప్రయాణికులు మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. బస్సు నడిపే డ్రైవర్ సహా, కండక్టర్ , ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని నిబంధనలు విధించింది.
కోవిడ్ జాగ్రత్తలతో....
ప్రతి ఆర్టీసీ బస్సులో శానిటైజర్ ను అందుబాటులో ఉంచాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆర్టీసీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా కోవిడ్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి బస్టాండ్ లో మైకుల ద్వారా ప్రయాణికులకు తెలియజెప్పాలని సూచించారు. డిపోలకు వచ్చిన బస్సులను ఎప్పటికప్పుడే శానిటైజ్ చేయాలని ఆదేశించారు
Next Story