Fri Nov 22 2024 20:33:31 GMT+0000 (Coordinated Universal Time)
TSRTC : సజ్జనార్ సంచలన నిర్ణయం.. ఉచిత బస్ ప్రయాణాలతో...?
తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. మహాలక్ష్మి పథకం కింద తెలంగాణలో కొత్తగా ఏర్పాటయిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. అయితే దీంతో బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఆర్టీసీ బస్సులలో ఆక్యుపెన్సీ రేటు బాగా పెరిగింది. రద్దీ ఎక్కువ కావడం, మహిళలు ఎక్కువగా బస్సుల్లోనే ప్రయాణిస్తుండటంతో కొత్త బస్సులను కూడా కొనుగోలు చేయాల్సి వచ్చింది.
రేపటి నుంచే...
ఈ సమయంలో ఫ్యామిలీ 24, టీ 6 టిక్కెట్లను టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రద్దు చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కొత్త ఏడాది తొలి రోజు నుంచి ఈ టిక్కెట్ల విక్రయాన్ని నిలిపివేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో కండక్టర్లకు ఫ్యామిలీ 24, టీ 6 టిక్కెట్లను ఇవ్వాలంటే కష్టంగా మారింది. ప్రయాణికులకు అసౌకర్యం కల్గించవద్దని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సజ్జనార్ తెలిపారు. రేపటి నుంచే ఈ టిక్కెట్లను నిలిపేస్తూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. దీంతో ఫ్యామిలీ టిక్కెట్లు రేపటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో అందుబాటులో ఉండవు.
Next Story