Thu Dec 26 2024 00:42:05 GMT+0000 (Coordinated Universal Time)
బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం
రాష్ట్ర బడ్జెట్ ను మంత్రి వర్గ సమావేశం ఆమోదించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశం ముగిసింది.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్్ మంత్రి వర్గ సమావేశం ఆమోదించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ప్రధానంగా రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పై చర్చ జరిగింది. బడ్జెట్ కు ఆమోదం తెలుపుతూ మంత్రి వర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు.
భారీ బడ్జెట్....
రేేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆర్థిక మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. ఈసారి భారీ అంచనాలతో బడ్జెట్ ను రూపొందించినట్లు తెలిసింది. ఒక రకంగా ఎన్నికల బడ్జెట్ గానే ప్రభుత్వం దీనిని భావిస్తుంది. సంక్షేమ పథకాల అమలుకే ఈ బడ్జెట్ లో పెద్ద పీట వేసినట్లు సమాచారం.
Next Story