Wed Dec 25 2024 13:31:49 GMT+0000 (Coordinated Universal Time)
రేపు కేబినెట్ సమావేశం.. ఈడీ నోటీసులపైనే చర్చ
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం రేపు జరగనుంది. కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం రేపు జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన నోటీసులపై చర్చ జరగనుంది. ఒకవేళ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేస్తే ఏరకమైన ఆందోళనలు చేయాలని మంత్రుల నుంచి అడిగి కేసీఆర్ సూచనలు తీసుకోనున్నారు.
కీలక అంశాలపై...
దీంతో పాటు పలు కీలక అంశాలపై కూడా చర్చించనున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో దళిత బంధు అన్ని నియోజకవర్గాల్లో అమలు అలాగే గిరిజన బంధు పైన కూడా చర్చించనున్నారు. సొంత ఇల్లు ఉండి నిర్మించుకునే వారికి మూడు లక్షల ఆర్థిక సాయం అందించే పథకంపై కూడా మంత్రి వర్గంలో చర్చించనున్నారు. ఈ పధకానికి సంబంధించి విధివిధానాలపై మంత్రులతో చర్చిస్తారు. ఇళ్ల స్థలాల కోసం పట్టాల పంపిణీ కార్యక్రమంపై కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది.
Next Story