Mon Dec 23 2024 06:43:49 GMT+0000 (Coordinated Universal Time)
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు తెలంగాణ సర్కార్ బ్రేక్
తెలంగాణ ప్రభుత్వం న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలను విధించింది.
తెలంగాణ ప్రభుత్వం న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలను విధించింది. ఈనెల 31వ తేదీ నుంచి జనవరి రెండో తేదీవరకూ ఆంక్షలుంటాయని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇటీవల హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి సూచించిన సంగతి తెలిసిందే. ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో కఠిన ఆంక్షలను అమలు పర్చాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
కఠినమైన ఆంక్షలు.....
దీంతో తెలంగాణ ప్రభుత్వం కఠినమైన ఆంక్షలను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మాస్క్ ధరించకపోతే ఖచ్చితంగా వెయ్యి రూపాయలు జరిమానా వేస్తామని చెప్పింది. తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. 38 కేసుల వరకూ నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. కోవిడ్ నిబంధనలను పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది.
Next Story