Mon Dec 23 2024 13:21:33 GMT+0000 (Coordinated Universal Time)
ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్థిక నష్టాల నుంచి గట్టెక్కే దిశగా అనేక ప్రయత్నాలను చేస్తుంది.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్థిక నష్టాల నుంచి గట్టెక్కే దిశగా అనేక ప్రయత్నాలను చేస్తుంది. పండగ పూట అత్యధిక సర్వీసులను నడుపుతూ ఆదాయాన్ని గడిస్తుంది. అలాగే రద్దీ ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటికి అదనపు సర్వీసులను కూడా వేస్తుంది. ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించేందుకు జరుగుతున్న ప్రయత్నంలో భాగంగా తాజాగా యాజామాన్యం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
డిసౌంట్ లు ఇలా...
ప్రయాణికులను మరింత చేరువ చేర్చుకునేందుకు అనేక పథకాలను ముందుకు తీసుకువస్తుంది. అందులో భాగంగా ముందస్తు రిజర్వేషన్లను చేయించుకునే వారికి రాయితీలను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. 31 రోజుల నుంచి 45 రోజులు ముందస్తు రిజర్వేషన్ చేయించుకుంటే టిక్కెట్ పై ఐదు శాతం రాయితీ లభిస్తుంది. 46 రోజుల నుంచి 60 రోజుల ప్రయాణానికి ముందు రిజర్వేషన్ చేయించుకుంటే పది శాతం డిస్కౌంట్ ను ప్రకటించింది.
Next Story