Sat Dec 21 2024 10:42:49 GMT+0000 (Coordinated Universal Time)
Komatireddy : పదవీ చేపట్టగానే తొమ్మిది ఫైళ్లపై సంతకం
తెలంగాణ రాష్ట్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు బాధ్యతలను స్వీకరించారు
తెలంగాణ రాష్ట్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు బాధ్యతలను స్వీకరించారు. బాధ్యతలను స్వీకరించిన వెంటనే తొమ్మిది ఫైళ్లపై సంతకాలు చేశారు. అసెంబ్లీ పరిసరాలను సుందరీకరణ చేస్తామని చెప్పారు. ఆసెంబ్లీ చారిత్రక, మేజ్మెంటల్ కౌన్సిల్ ను మారుస్తామని చెప్పారు. రహదారుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు.
రహదారుల అభివృద్ధికి....
శాసనసభ కార్యాలయాలను తొలగించి వాటి స్థానంలో కొత్తవి నిర్మిస్తామన చెప్పారు. నల్లగొండ జిల్లాలో ధర్మాపురం వరకూ నాలుగు లేన్ల రహదారిని నిర్మిస్తామని ఆయన మీడియాకు వివరించారు. కొడంగల్ నియోజకవర్గంలోని లింగంపల్లి - దుగ్యాల రోడ్డు పనులు మంజూరు చేస్తామని చెప్పారు. పెండింగ్ లో ఉన్న జాతీయ రహదారులను నిర్మించాలని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలసి కోరుతానని తెలిపారు.
Next Story